తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై విజయ్ స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూరులో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
இதயம் நொறுங்கிப் போய் இருக்கிறேன்; தாங்க முடியாத, வார்த்தைகளால் சொல்ல முடியாத வேதனையிலும் துயரத்திலும் உழன்று கொண்டிருக்கிறேன்.
கரூரில் உயிரிழந்த எனதருமை சகோதர சகோதரிகளின் குடும்பங்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்களையும், இரங்கலையும் தெரிவித்துக்கொள்கிறேன். மருத்துவமனையில் சிகிச்சை…
— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2025
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేతగా విజయ్ భారీ సభను ఏర్పాటు చేశాడు. ఈ సభకు పోలీస్ అనుమతి కూడా తీసుకున్నారు. 10వేలమందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు కానీ విజయ్ అభిమానులు అక్కడకు భారీగా వచ్చారు దాంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఒకరిమీద ఒకరు పడి తొక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 50కి పైగా గాయపడ్డారు. ఆరుగురు చిన్నారులు, 16మంది మహిళలు చనిపోయారు. తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. చనిపోయిన వారికిరూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు సీఎం స్టాలిన్.