వీల్‌చైర్‌లో మైదానం వీడిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే.. కేవలం 2 రోజుల్లోనే విధ్వంసం..

వీల్‌చైర్‌లో మైదానం వీడిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే.. కేవలం 2 రోజుల్లోనే విధ్వంసం..


IND W vs NZ W: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దీనికి ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టీమిండియా తమ రెండవ వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మైదానంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నుంచి ఒక యువ క్రీడాకారిణి బలమైన పునరాగమనం చేసింది. ఈ క్రీడాకారిణి రెండు రోజుల క్రితం తీవ్రమైన గాయంతో బాధపడింది. ఆమె మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆమె అద్భుతంగా రాణించడం గమనార్హం.

వీల్‌చైర్‌పై మైదానం వదిలి.. కట్‌చేస్తే.. బలమైన రీఎంట్రీ..

2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి గాయపడటంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కానీ కేవలం రెండు రోజుల తర్వాత, న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అరుంధతి అద్భుతమైన పునరాగమనంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శన ఆమె ఫిట్‌నెస్, స్ఫూర్తిని నిరూపించడమే కాకుండా, ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టుకు ఉపశమనం కలిగించింది. ఈ మ్యాచ్‌లో, అరుంధతి తొమ్మిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం..

వార్మప్ మ్యాచ్ సందర్భంగా, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హీథర్ నైట్ ఆడిన పవర్ ఫుల్ షాట్ ఆడడంతో అరుంధతి రెడ్డి ఎడమ కాలుకు తగిలింది. ఫాలో-త్రూ చేస్తున్నప్పుడు ఆమె బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. బంతి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో ఆమె అసౌకర్యంగా పడిపోయింది. తీవ్రమైన నొప్పితో ఉన్నట్లు కనిపించింది. మైదానంలోని వైద్య బృందం వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, అరుంధతిని వీల్‌చైర్‌లో మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన భారత శిబిరంలో ఆందోళనను రేకెత్తించింది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌తో జరిగిన ఈ వార్మప్ మ్యాచ్‌లో అరుంధతి రెడ్డితో పాటు, ఇతర బౌలర్లు కూడా బాగా రాణించారు. ముందుగా బౌలింగ్ చేసిన టీం ఇండియా 8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ను 232 పరుగులకే పరిమితం చేయగలిగింది. అరుంధతి రెడ్డితో పాటు, శ్రీ చరణి కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. ప్రతీకా రావల్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *