సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కంటెంట్ బాగుండి.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన చాలా మూవీలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ సినిమా ఒకటి.. యంగ్ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు.
ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!
సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ సినిమా వచ్చేస్తుంది. దసరా కానుకగా లిటిల్ హార్ట్స్ సినిమాను ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అక్టోబరు 1న లిటిల్ హార్ట్స్ సినిమా ఓటీటీలోకి రానుంది. అంతే కాదు సర్ప్రైజ్ కూడా ఉండనుందట.. సినిమాలో మరికొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేయనున్నారట. ఈ మేరకు ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది.
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.