అనకాపల్లి జిల్లాలో ఓ రైతుకు గుండె ఆగే పని అయింది. రైవాడ కాలువ సమీపానికి వెళ్లిన.. అతనికి ఏదో వింత శబ్దాలు వినిపించాయి. తొంగి చూసేసరికి ఏదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది. కాస్త ఏకాగ్రతతో చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించే సీన్.. దీంతో స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ కాలువ. అక్కడికి స్థానికులు రైతులు వెళుతూ ఉంటారు. ఆ రోడ్డులో స్థానికులు సంచరిస్తూ ఉంటారు. ఇంతలో ఓ రైతుకు ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న వ్యక్తి ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు. ఏదో కదులుతున్నట్టు కనిపించింది. తొమ్మిది చూస్తే.. భారీ గిరినాగు అతని దృష్టిలో పడింది. దీంతో గుండెలు పట్టుకున్నాడు. స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకింది.
స్థానికులు.. అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కృష్ణ.. గిరినాగు పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము రైవాడ కాలువ లోపల నుంచి పైకి వస్తున్నట్టు గుర్తించాడు. భారీ గిరినాగు వేగంగా పాకుతూ వెళ్తున్న దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒకింత భయానికి గురయ్యారు. గిరినాగు తోలుత చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ రాచనాగును బంధించేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది. అయినా కోబ్రా ఆటలు సాగనివ్వలేదు స్నేక్ క్యాచర్ కృష్ణ. ఎంతో నేర్పుతో కింగ్ కోబ్రాను బంధించిన కృష్ణ.. దానిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..