సముద్ర గర్భంలో ఎన్నో అద్భుతాలు, ఇంకెన్ని అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అవి మానవ సాంకేతికతకు అంతుచిక్కని గొప్ప రహస్యాలు. ఒడ్డుకు కనిపించే జలచరాలు అతికొద్ది మాత్రమే.. సముద్రపు లోతుల్లో ఉండే మరిన్ని వింత జీవులు.. ఈ విశాల ప్రపంచానికి అస్సలు కనిపించవు. ఇక ఇవన్ని పక్కనపెడితే.. సముద్రపు అలెగ్జాండర్గా పిలవబడే జీవి.. తరచూ జాలర్లకు తారసపడుతుంటుంది. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ఇండియాలో మాత్రం కాదండీ.. విదేశాల్లో జరిగి ఉండొచ్చు. కానీ కరెక్ట్ ప్లేస్ ఎక్కడా అనేది తెలియదు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సరదాగా చేపల వేటకు ఒక సరస్సులోకి వెళ్లాడు. ఎంచక్కా తన బోట్ వేసుకుని ఆ సరస్సులో అలా.. అలా.. ముందుకు వెళ్తున్నాడు. ఈలోగా అతడ్ని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది సాల్ట్ వాటర్ క్రోకడైల్. అవునండీ.! నిజమే.. మొసళ్లు నీటిలో చాలా బలంతో ఉంటాయి. అలాగే తమ ఎరను చాకచక్యంగా పట్టుకుంటాయి. సరిగ్గా ఆ క్రమంలోనే అతడి బోట్ పక్కనే నీటిలో దాక్కుంటూ పైకి వస్తోంది ఈ మొసలి. అవతల మొసలి ఉంటే.. నాకేంటి అన్నట్టు.. మనోడు దాన్ని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశాడు. చివరికి ఏం జరిగిందో తెలియదు గానీ.. ఈ వీడియో క్లిప్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Saltwater crocodile slowly surfaces right next to boat 💀 pic.twitter.com/krNJTZQiwY
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 17, 2025