సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, మీమ్స్‌తో పాటు ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్లే. ఎంతోమంది నెటిజన్లు వీటిని సాల్వ్ చేయడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. నెంబర్ గేమ్స్, కళ్లను మాయ చేసే ఫోటోలు, మెదడును తికమక పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇలా ఒకటేమిటి సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ లెక్కలేనన్ని దొరుకుతాయి. మరి మీరు కూడా మీ స్ట్రెస్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ పొందాలంటే.. ఓసారి ఈ ఫోటో పజిల్‌ను పట్టు పట్టండి. అటు ఫన్.. ఇటు బుర్రకు పదును రెండూ మీకు వస్తాయి.
హాయ్ గయ్స్..! మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. ఈ కిక్కిచే పజిల్‌ను ఓ చూపు చూసేయండి. పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? ఫోటోలో ఏ వరుస చూసినా.. మీకు ’89’ నెంబర్ కనిపిస్తుంది. కరెక్టే మీ గెస్. అక్కడ అన్ని వరుసలలోనూ ఉన్నది ‘89’ నెంబర్ అని అనుకుంటే పొరపాటే.. మీకోసం ’88’ నెంబర్‌ను కూడా అక్కడ దాచిపెట్టాం. అదెక్కడుందో కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. అది ఏ వరుసలో ఉందో కేవలం 10 సెకన్లలో గుర్తించాలి. పైపైన ఫోటో చూశారంటే.. మీరు కచ్చితంగా ఓడిపోయినట్టే. క్షుణ్ణంగా ఫోటోను పరిశీలిస్తేనే మీరు ఆ నెంబర్‌ను గుర్తించగలరు. మీ కళ్లల్లో పవర్ ఉంటే.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఈ పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఒకవేళ ఎంత వెతికినా మీకు ఆన్సర్ దొరక్కపోతే.. మీకోసం సమాధానాన్ని కింద ఇచ్చేస్తున్నాం. ఓసారి చూసేయండి.
