ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద ముంపులో ఉన్న కనకాయలంక గ్రామానికి ఓ పెళ్లికూతురు పడవలో వెళ్లింది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు కనకాయలంక – చాకలి పాలెం కాజ్వే మునిగిపోవడంతో కనకాయిలంక వాసులకు వరద కష్టాలు తప్పడం లేదు. దీంతో గ్రామంలో పెళ్లి పెట్టుకున్న ఓ కుటుంబం కూడా వరద కారణంగా ఇబ్బందులు పడింది.
శ్రీరంగం వెడ్స్ సత్య శ్రీవతి పెళ్లి ముహుర్తాన్ని శనివారం రాత్రి 9.35 నిమిషాలకు నిర్ణయించారు. వరుడిది గోదావరి అవతలి వైపు కనకాయలంక, వధువుది మల్కిపురం మండలం కత్తిమండ గ్రామం. దీంతో పెళ్లి కుమార్తె పెళ్లి ఇంటికి చేరుకోడానికి వరద అడ్డంకిగా మారింది. తప్పని పరిస్థితుల్లో పెళ్లికూతురు పడవలో ప్రయాణం చేసి..కనకాయలంక చేరుకుంది.
కాగా వరదనీరు చుట్టుముట్టడంతో.. లంక గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడి పిల్లలు స్కూళ్లకు వెళ్లాలన్నా.. ఎవరికైనా సుస్తి చేస్తే హాస్పిటల్కు పోవాలన్నా.. అంతెందుకు.. నిత్యవసర సరుకులు సరుకులు కొనుక్కోవాలన్నా తాటిపాక సెంటర్ను చేరుకోవాల్సిందే. కానీ అక్కడికి వెళ్లడానికి కూడా ఇప్పుడు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.