Gold, Silver Price: బంగారం, వెండి ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. రెండు లోహాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రెండింటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ పెరుగుదల కొనసాగవచ్చు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ రాబోయే కాలంలో బంగారం ధరలు 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక అనిశ్చితి. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది. బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే సామాన్యులు బంగారం కొనే పరిస్థితిలో లేరు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి బంగారం ధరలు భగ్గుమన్నాయి. తులం బంగారంపై ఏకంగా 600 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,850 వద్ద ఉంది.
ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా 6,000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి 1,49,000 ఉంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే వెండి ధర భగ్గుమంటోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,59,000 వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,000 వద్ద ఉంది.
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..