టాలీవుడ్‌లో అగ్రతారలుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చిన్నపాటి వివాదం మొదలైంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదని, రాజకీయాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసినప్పుడు చిరంజీవికి జరిగిన అవమానంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్న కామినేని మాటలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చిరంజీవి నిలదీయడం అబద్ధమని, అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి వెంటనే పత్రికా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు.
ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!
తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పై నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం అన్నారు నారాయణ మూర్తి. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఆరోజు జగన్ ను కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్ మోహన్ రెడ్డి గారిని కలసినప్పుడు ఆయన ఎంతో గౌవరం ఇచ్చారు అని నారాయణ మూర్తి అన్నారు.
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
గత గవర్నమెంటు మా సినిమా వాళ్ళను అవమానించలేదు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు.. అది ఆయన సంస్కారం. అందరూ చిరంజీవి గారి నివాసంలో కలిశాము. చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్ తో మాట్లాడారు. చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే.. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రికెస్ట్ చేస్తున్న.. ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నఫిల్మ్ ఛాంబర్ ను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను పిలవండి. పిలిచి మాట్లాడి .. ప్రాబ్లమ్స్ ను తెలుసుకోండి. రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచను, మిడ్ నైట్ షో లను వెయ్యను.. అని చెప్పిన మాటలకి సెల్యూట్… అదే మాట మీద నిలబడాలి అని కోరుతున్నా.. మీరు రేట్స్ పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్ట పోతున్నారు అని నారాయణమూర్తి అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.