అనవసరంగా చేశా.. ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగింది.. మోసం చేశారు.. హీరో షాకింగ్ కామెంట్స్

అనవసరంగా చేశా.. ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగింది.. మోసం చేశారు.. హీరో షాకింగ్ కామెంట్స్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2, హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.

ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!

ప్రభాస్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్.. దశరద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాలో నటించి తప్పు చేశా అని ఓ నటుడు అన్నారు. ఇంతకూ అతను ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

బుల్లి తెర నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో సాగర్ ఒకడు. ‘మొగలిరేకులు’ సీరియల్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు సాగర్. ఇప్పుడు ఆయన హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. సాగర్ నటించిన 100 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాగర్ మాట్లాడుతూ.. షాకింగ్ విషయం తెలిపాడు. అందులో ప్రభాస్ సినిమాలో నటించి తప్పు చేశా అని కామెంట్ చేశాడు. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించాడు సాగర్. అయితే ఆ సినిమాలో తనకు సెకండ్ హీరో పాత్ర అని చెప్పారని.. తీరా సినిమా తీరా సెట్‌కి వెళ్లాక చాలా సీన్లు కట్ చేసేసి చిన్న పాత్ర చేశారని సాగర్ అన్నారు. నేను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు 15 రోజులు డేట్స్ ఇచ్చా.. కానీ రెండు మూడు రోజులు నాపైన సీన్స్ తీయలేదు.. అప్పుడు నేను వెళ్లి అడిగా రేపటి నుంచి ఉంటాయి అని చెప్పారు. తీరా సీన్స్ చేసే టైంలో నేను డైరెక్టర్‌ను అడిగా.. కొన్నిసార్లు క్యారెక్టర్స్ మారుతుంటాయి అర్ధం చేసుకోండి అని చెప్పారు. దాంతో నేను చేయను అని వచ్చేశా.. డబ్బు కోసం కాదు.. నా ఎంట్రీ బాగుండాలి అనుకున్న ఇలా అయితే నాకు వద్దు అని వచ్చేసా.. కానీ నా పై తీసిన సీన్స్ ను సినిమాలో వాడేశారు.. అది నా పై ఎఫెక్ట్ చూపించింది అని తెలిపాడు సాగర్. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *