శరవేగంగా బుల్లెట్‌ రైలు పనులు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌.. ఎప్పటినుంచంటే..?

శరవేగంగా బుల్లెట్‌ రైలు పనులు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌.. ఎప్పటినుంచంటే..?


ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 320 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోంది. రెండు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకునే విధంగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి. సూరత్ స్టేషన్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు.

భారతదేశంలో బుల్లెట్ రైలు కోసం సన్నాహాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా మధ్య మొదటి 50 కిలోమీటర్ల విభాగం 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం ముంబై-అహ్మదాబాద్ లైన్ 2029 నాటికి పూర్తి అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం (సెప్టెంబర్ 27) ప్రకటించారు. బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ముంబై నుండి అహ్మదాబాద్‌కు ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాలు పట్టనుంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూరత్ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ నిర్మిస్తున్న ట్రాక్ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ చాలా బాగా జరుగుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సూరత్-బిలిమోరా విభాగం 2027లో, థానే-అహ్మదాబాద్ విభాగం 2028లో.. మొత్తం లైన్ 2029 నాటికి అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాన లైన్ గంటకు 320 కి.మీ వేగంతో పనిచేయడానికి రూపొందించడం జరిగింది. అయితే లూప్ లైన్ గంటకు 80 కి.మీ వేగంతో పనిచేస్తుంది. వైబ్రేషన్ తగ్గింపు వ్యవస్థలు, బలమైన గాలులు, భూకంపాల నుండి రక్షణ వంటి భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సూరత్ స్టేషన్‌లో ప్రధాన నిర్మాణం పూర్తయింది. ట్రాక్ లింకింగ్, ఫినిషింగ్, యుటిలిటీ పనులు జరుగుతున్నాయి. ట్రాక్‌లు కలిసే, వేరు చేసే మొదటి టర్నౌట్‌ను రోలర్ బేరింగ్‌లు,యు కాంపోజిట్ స్లీపర్‌ల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కారిడార్ వెంబడి ఉన్న నగరాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానిస్తుందని, జపాన్‌లోని హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ మాదిరిగానే ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో వివరించిన విధంగా మరో నాలుగు బుల్లెట్ రైలు కారిడార్ల ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

సూరత్‌లోని బుల్లెట్ రైలు స్టేషన్ ప్రయాణీకులకు చాలా చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో వెయిటింగ్ లాంజ్, నర్సరీ, రెస్ట్‌రూమ్‌లు, రిటైల్ దుకాణాలు వంటి వివిధ సౌకర్యాలు ఉంటాయి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు అందరికీ సులభంగా చేరుకునేలా చేస్తాయి. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటిలో ప్రత్యేక సంకేతాలు, సమాచార కియోస్క్‌లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *