బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంది. సెలబ్రెటీలకు, కామనర్స్ కు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది.. హౌస్ లో రెండు టీమ్స్ పోటాపోటీగా ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ.. అరుచుకుంటూ గొడవలు పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు.వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తారు. వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన రచ్చ పై నాగ్ చర్చించి తప్పు ఒప్పులు చెప్తారు. ఇక ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం సంజన ఎలిమినేట్ అవుతుంది అంటూ ముందే అనౌన్స్ చేశారు. ఆమె ఎలిమినేట్ అని ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోల్లో సంజన ఎలిమినేట్ అయ్యిందని అనౌన్స్ చేశారు.
ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సంజన హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేసింది. ఈ ప్రోమోలో సంజనను స్టేజ్ పైకి పిలిచిన నాగ్ .. హౌస్ లో ఉన్నవారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకొక్కరి పై సంజన రెచ్చిపోయింది. స్టేజ్ పైకి వచ్చిన సంజన .. ఎలా ఎలిమినేట్ అయ్యానో అర్ధం కావడం లేదు సార్ అని చెప్పింది. డ్ . అన్ని ఒక్కసారి అంటే బాగుంటుంది.. అదే కంటిన్యూ చేస్తే వాళ్లకు ఇరిటేషన్ వస్తుంది అని అన్నారు. సుమన్ శెట్టితో మొదలు పెడదాం అని అనగానే దేనికి స్టాండ్ తీసుకోడు అని అంది.. దానికి నాగ్ స్టాండ్ తీసుకోడు పోనీ అండర్ స్టాండింగ్ ఉందా అని అడిగితే లేదు సార్ అని చెప్పింది సంజన.
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
ఆతర్వాత శ్రీజ మార్చుకోవాల్సింది ఏంటి.? అని నాగ్ సంజనను అడిగ్గా.. 1000 పర్సెంట్ వరస్ట్ ఆర్గ్ మెంట్ నుంచి 300 పర్సెంట్ వరస్ట్ ఆర్గ్ మెంట్ కు దిగింది సార్ అని తెలిపింది. ఆతర్వాత భరణి మిస్ యూ సంజనగారు అని అనగానే బయటకు వెళ్ళడానికి ఓటేసింది నువ్వే కదా అని నాగ్ భరణికి కౌంటర్ ఇచ్చారు. ప్రతి రోజూ అన్న చెల్లిగా ఉండాల్సిన అవసరం లేదు అని సంజన కూడా చెప్పుకొచ్చింది. ఆతర్వాత హరీష్ పేరు చెప్పగానే .. ఏం చెప్పినా కూడా ఆయన గొడవకు వచ్చేస్తారు. ఆయనతో ఉండలేం.. తనే గొప్ప.. తనే ప్రైమ్ మినిస్టర్ లా ఫీల్ అవుతుంటాడు. తోక్కేస్తున్నారు మనుషుల్ని అక్కడ అని సీరియస్ అయ్యింది సంజన. ఆతర్వాత రాము రాథోడ్ పేరు చెప్పగానే సంజన శివాలెత్తింది. కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది.. కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది అన్నాడు.. ఎప్పుడురా నేను నిన్ను చిన్నగా ట్రీట్ చేశాను.. బిడ్డా..? ఎంత చీప్ అమ్మాయివి అన్నావు.. అనగానే నేను అనలేదు అని రాము అన్నాడు.. దానికి సంజన రికార్డింగ్ ఉంది ఊర్కో అంటూ ఫైర్ అయ్యింది. చివరిగా ఇమ్మూ పేరు చెప్పగానే ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు.అతను స్వీట్ హార్ట్ ఏడవకు అని చెప్పింది. వెంటనే ఇమ్మూ ఆమె ఒళ్లో తలపెట్టుకొని పడుకుంటే నాకు మా అమ్మే గుర్తోచింది సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మూ. . దాంతో సంజన కూడా ఎమోషనల్ అయ్యింది.
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
https://www.youtube.com/watch?v=p06QK8rmnaw
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.