Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!


Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

అభం శుభం తెలియని తన మనవరాళ్లను కేక్ తినిపించి చంపిన ఘటనలో 59 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు నానమ్మ ఇంటికి వచ్చారు ఆ చిన్నారులు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో టీ, విషం కలిపిన కేక్ తయారు చేసిన ఇజాబెల్.. ఆ ఇద్దరు చిన్నారులకు తినిపించింది. 9 ఏళ్ల బాలిక అలానా కేక్ తిని తీవ్రమైన కడుపునొప్పిని ఎదుర్కుంది.. అటు 11 ఏళ్ల మరో బాలిక తక్కువ మోతాదులో విషం నిండిన కేక్ తినడంతో ఆమెకు స్వల్పంగా లక్షణాలు కనిపించాయి. అటు ఈ ఘటనలో ఆమె పెంపుడు పిల్లి కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. వికారం, తీవ్రమైన కడుపునొప్పి లాంటి ఇబ్బందులను ఆ ఇద్దరు పిల్లలు చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు నానమ్మ, తాతయ్యలు. అయితే 9 ఏళ్ల అలానా మార్గం మధ్యలోనే తన తుది శ్వాస విడిచింది. జూలై 23న ఈ ఘటన జరగ్గా.. ఆ సమయంలో చనిపోయిన పిల్లి కళేబరాన్ని, ఆ ఇంట్లో తయారు చేసిన కేక్ నమూనాలను పరిశోధనలకు పంపించారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పక్కా ఆధారాలతో సెప్టెంబర్ 19న ఇజాబెల్‌ను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. కేక్, మరణించిన బాలిక శరీరంలో పురుగుమందులు, వ్యవసాయ రసాయనాలలో ఉపయోగించే విషపూరిత పదార్థం టెర్బుఫోస్‌ను కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి. ఈ విషపూరిత పదార్ధం మనిషి శరీరంలోకి వెళ్లినప్పుడు.. అది నాడీ వ్యవస్థపై దాడి చేసి కండరాల బలహీనతకు కారణమవుతుందని ఫోరెన్సిక్ నిపుణులు అన్నారు. మూర్ఛలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తిమ్మిరి లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. అయితే తన మనవరాళ్లను నానమ్మ ఎందుకు చంపిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత సంవత్సరం క్రిస్మస్ నాడు కూడా ఆమె భర్త కుటుంబంలోని ఆరుగురును విషం ఇచ్చి చంపినట్టు.. ఆమెపై ఆరోపణలు వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *