ఒడిశాకు ప్రధాని మోదీ కానుక.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌కు ప్రధాని శ్రీకారం

ఒడిశాకు ప్రధాని మోదీ కానుక.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌కు ప్రధాని శ్రీకారం


ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో శనివారం (సెప్టెంబర్ 27) రూ. 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొన్నారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.

టెలికమ్యూనికేషన్ రంగంలో, దాదాపు రూ. 37,000 కోట్ల వ్యయంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన 97,500 కు పైగా 4G మొబైల్ టవర్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో BSNL ఏర్పాటు చేసిన 92,600 కు పైగా 4G టవర్లు కూడా ఉన్నాయి. డిజిటల్ ఇండియా ఫండ్ కింద, 18,900 కంటే ఎక్కువ 4G టవర్లు నిర్మించడం జరిగింది. ఇవి మారుమూల ప్రాంతాలతోపాటు, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలోని సుమారు 26,700 గ్రామాలను కలుపుతాయి. ఈ టవర్లు 2 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులకు సేవలు అందిస్తాయి. ఈ టవర్లు సౌరశక్తితో నడిచేవి, వీటిని భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌గా, స్థిరమైన మౌలిక సదుపాయాల వైపు ఒక అడుగు ముందుకు వేస్తాయి.

అలాగే, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, అనేక రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇవి కనెక్టివిటీని, ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతాయి. వీటిలో సంబల్పూర్-సరళ రైలు ఫ్లైఓవర్ శంకుస్థాపన, కోరాపుట్-బైగూడ లైన్ డబ్లింగ్, మనబార్-కోరాపుట్-గోర్పూర్ లైన్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఒడిశా తోపాు పొరుగు రాష్ట్రాల మధ్య వస్తువులు, ప్రజా రవాణానున మెరుగుపరుస్తాయి. స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయి.

బెర్హంపూర్-ఉధ్నా (సూరత్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది అంతర్ రాష్ట్ర ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. పర్యాటకాన్ని పెంచుతుంది. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీ, సంబల్‌పూర్‌లోని VIMSAR లను ప్రపంచ స్థాయి సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *