కన్నడ సినిమాలతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ?
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో అటు కన్నడ, ఇటు తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
రుక్మిణి వసంత్ 2019లో ఎం.జి. శ్రీనివాస్ తో కలిసి బీర్బల్ ట్రైలజీ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాల అవకాశాలు అందుకుంటుంది.
ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన కాంతార చాప్టర్ 1సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్రం అక్టోబర్ 2న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కాంతార చాప్టర్ 1 మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.
మరోవైపు ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ నటిస్తుంది. అలాగే సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్టులోనూ ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. తాజాగా ఆమె చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.