అర చేతిలోకి ఫోన్ వచ్చాక మనలో చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు దానితోనే గడిపేస్తుంటాం. క్రమంగా ఇది మన రోజువారీ జీవితంలో ఒక భాగమై పోతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కంటే స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లు అన్ని సమయాలలో విస్తృతంగా ఉపయోగించడం నేటి కాలంలో సాధారణమై పోయింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడకంతో ప్రపంచం ఒక్కసారిగా మీ అర చేతిలోకి వచ్చింది. కానీ ఇవి నెమ్మదిగా, అత్యంత రహస్యంగా మీ ఆరోగ్యంపై దారుణంగా దెబ్బకొడతాయని మీకు తెలుసా? అవును.. థానేలోని హారిజన్ ప్రైమ్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుహీల్ ధన్సే దీని గురించి ఏం చెబుతున్నారంటే..
ఎక్కువసేపు స్క్రీన్ సమయం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని చెబున్నారు. ఉక్కువసేపు ఫోన్ స్క్రీన్ చూడటం.. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన భంగిమ లేకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, సరైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వంటి వాటితో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ తీవ్రమైన గుండె రోగాలకు దారితీస్తాయని అంటున్నారు. మీరు ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల వచ్చే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దీనిని సాధారణ అలసటగా తోసిపుచ్చవచ్చు. కానీ తరచుగా అవి కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని డాక్టర్ ధన్సే అంటున్నారు. ముఖ్యంగా అలసట, తలనొప్పి, నిద్ర లేకపోవడం, దడ, మాటల్లో చెప్పలేని ఆందోళన వంటివి ముందస్తు హెచ్చరిక సంకేతాలు. రాత్రిపూట ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి వల్ల శరీర గడియారం కూడా దెబ్బతింటుంది. ఇది అధిక రక్తపోటు, బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసే ప్రమాద కారకాలే.
స్క్రీన్‌టైమ్ మీ మొత్తం ఆరోగ్యంపై బహుముఖ ప్రభావాన్ని చూపుతుంది. వంగి ఉన్న భంగిమ వల్ల మెడ నొప్పి, నిరంతరం స్క్రోలింగ్ చేయడం వల్ల మణికట్టు బిగుసుకుపోవడం వంటి తీవ్రమైన హృదయ సంబంధ ప్రమాదాలకు దారి తీస్తాయి. సుదీర్ఘకాలం ఒకే చోట కూర్చుని నిష్క్రియాత్మకంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. నిశ్చల జీవనశైలి రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయానికి దారి తీస్తుంది. ఇవన్నీ గుండెపోటు, స్ట్రోక్‌లకు బలమైన కారకాలు. అధిక ఒత్తిడి, స్క్రీన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల నిద్రలేమి వేధిస్తుంది. ఇలాంటి వ్యక్తులలో క్రమరహిత గుండె లయలను (అరిథ్మియా) ప్రేరేపిస్తాయని డాక్టర్ ధన్సే తెలిపారు. అనేక అధ్యయనాల ఆధారంగా, స్క్రీన్‌లపై 4 నుండి 6 గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశాన్ని నేరుగా పెంచుతుంది.
ఇవి కూడా చదవండి
ఎలా నివారించాలి?
గుండెను కాపాడుకోవడానికి దినచర్యపై తగిన శ్రద్ధ పెట్టాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ ధన్సే సూచించారు. ప్రతి 30-40 నిమిషాలకు చిన్న విరామాలు తీసుకోవాలి. ఈ సమయాన్ని క్రమంగా సాగదీయాలి. నిద్ర చక్రాన్ని భంగం కలగకుండా నిద్రవేళకు ఫోన్ పక్కన పెట్టేసి సహజంగా నిద్రను ఆహ్వానించాలి. శారీరక శ్రమ, సమతుల్య భోజనంకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే 6 నెలలకు ఒకసారి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.