Tech Tips: కొత్త ఫోన్‌ కొంటున్నారా?.. ఇవి కచ్చితంగా చెక్‌యుండి.. లేదంటే నష్టపోయేది మీరే!

Tech Tips: కొత్త ఫోన్‌ కొంటున్నారా?.. ఇవి కచ్చితంగా చెక్‌యుండి.. లేదంటే నష్టపోయేది మీరే!


ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో, చాలా మంది ఆఫర్‌లకు ఆకర్షితులవుతారు. భారీ డిస్కౌంట్‌లతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. అయితే వీరు ఫోన్ కొనడానికి ముందు ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను మాత్రమే చూస్తున్నారు. వాటి ఫీచర్స్‌ను, ఫర్ఫామెన్స్ గురించి పట్టుకోవట్లేదు. కాబట్టి మీరు ఫోన్‌ కొనాలనుకుంటే.. ముందు ఈ అంశాలను పరిశీలించండి.

ప్రాసెసర్

మొబైల్ కొనేటప్పుడు ముందు మొదటగా చెక్ చేయాల్సినది ప్రాసెసర్. ప్రాసెసర్ అనేది ఫోన్‌కు గుండెవంటి.. ఎంత మంచి ప్రాససర్ ఉంటే ఫోన్‌ ఫర్ఫామెన్స్‌ అంతమంచిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, మీడియాటెక్, శామ్‌సంగ్ ఎక్సినోస్ వంటి అనేక ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ప్రాసెసర్ ఏ ధరకు లభిస్తుందో మీరు తెలుసుకోవాలి. మంచి ప్రాసెసర్ తక్కువ ధరకు లభిస్తే, అలాంటి వాటిని ఎంచుకోండి.

డిస్‌ప్లే

మొబైల్ కొనే ముందు చెక్‌చేయాల్సిన మరో ముఖ్యమైన విషయం డిస్‌ప్లే. వీటిలో LCD, LED, AMOLED మొదలైన అనేక రకాలు ఉన్నాయి. వీటిలో LED, AMOLED అనేవి లేటెస్ట్ టెక్నాలజీ డిస్ప్లేలు. LCD కొంచెం పాత టెక్నాలజీ. LCD అంత మంచిది కాకపోవచ్చు. స్క్రీన్ రిజల్యూషన్ పరంగా, మీరు కనీసం పూర్తి HD లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకోవాలి. అంటే, 2K, 4K. సాధారణ HD డిస్ప్లే ఉన్న ఫోన్‌లను ఎంచుకోండి. అలాగే, రిఫ్రెష్ రేట్ కనీసం 90 Hz ఉండేలా చూసుకోండి.

కెమెరా

ఈ రోజుల్లో, ఫోన్‌లో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. అయితే, కెమెరా విషయంలో మొబైల్ కంపెనీలు మిమ్మల్ని మోసం చేస్తాయి. ఎక్కువ మెగాపిక్సెల్‌లు ఉంటే, ఆ కెమెరా మంచిదని వారు ప్రమోట్ చేస్తారు. మనం కూడా అదే నిజమని నమ్ముతాం.. కానీ ఫోటో నాణ్యత అనేది కెమెరా సెన్సార్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, Samsung S సిరీస్, iPhones యొక్క 16 MP కెమెరాలు చైనీస్ బ్రాండ్‌ల మొబైల్‌లలోని 200 MP కెమెరాల కంటే మెరుగైన పనితీరును అందిస్తాయి. కాబట్టి మీరు ఫోన్‌ కొనే ముందు వాటిలో ఎలాంటి లెన్స్‌ వాడుతున్నారో Googleలో చూసి తెలుసుకోండి.

స్టోరేజ్, బ్యాటరీ

మొబైల్ లో బ్యాటరీ అతి ముఖ్యమైన భాగం. కాబట్టి, బ్యాటరీ సామర్థ్యం కనీసం 5000 mAh లేదా అపై ఉండేట్టు చూసుకోండి. అలాగే, RAM కనీసం 6 GB లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే, ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఇవి మన నేటి జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *