టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మొదటి వారం తన ఆట తీరుతో హౌస్మేట్స్ కు చుక్కలు చూపించిన సంజన.. ఇప్పుడు జనాలకు నచ్చేస్తుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ తనను మిడ్ వీక్ ఎలిమినేట్ చేయగా.. ఇప్పుడు సీక్రెట్ రూం టాస్కు నడుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. డ్రగ్స్ కేసులో ఆమెకు ఈ నోటీసులు జారీ చేసింది. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ మసయంలో సినీనటి రాగిణి ద్వివేదితోపాటు సంజనాను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 14వ నిందితురాలిగా ఆమె పేరును చేర్చారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. సంజనాపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్త పదార్థాల వినియోగించడంతోపాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2024 మార్చి 25న కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం సెక్షన్ 219 సీఆర్పీసీ ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్ లో జరపలేమని పేర్కొంది. దీంతో ఈ కేసులో ఆమెకు ఉపశమనం కలిగింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సంజనాకు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ సంజనా ఎక్స్‌టసీ, కొకైన్, MDMA, LSD మొదలైన మాదకద్రవ్యాలను సేకరించడానికి నైజీరియన్ డ్రగ్ డీలర్స్ తో సంప్రదింపులు జరిపినట్లు కాల్ రికార్డ్స్ ఉన్నాయని.. అలాగే ఫోన్ ల ఫోరెన్సిక్ అంచనాలలోనూ ఈ విషయం వెల్లడైందని అన్నారు. ఆమె ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో వివిధ వ్యక్తులకు వాటిని విక్రయించిందని, అక్రమ అమ్మకాలకు పాల్పడ్డాడని వివిధ సాక్షులు సాక్ష్యమిచ్చారని ధర్మాసనం ముందు వాదించారు.ఆమె బహిరంగ ప్రదేశాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, పరిసర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టించిందని ఆమె ఇరుగుపొరుగువారు తెలిపారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగుళూరు పోలీసులు కోరినప్పటికీ ఆమె చెప్పలేదని సమాచారం. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..