Gold, Silver Rates: బంగారం, వెండి కొనడం ఇక కష్టమే.. దసరా, దీపావళి ముందు రికార్డులన్నీ షేకయ్యాయ్..

Gold, Silver Rates: బంగారం, వెండి కొనడం ఇక కష్టమే.. దసరా, దీపావళి ముందు రికార్డులన్నీ షేకయ్యాయ్..


పది గ్రాముల బంగారం ధర లక్షా 20వేలు టచ్ అవుతోంది. ఈస్థాయి పెరుగుదల కొమ్ములు తిరిగిన మార్కెట్ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు. దీనింతటికీ కారణం అంతర్జాతీయ పరిణామాలేనని ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. జియో పాలిటిక్స్‌, ఆర్థిక అనిశ్చితి. డాలర్ బలహీనత. ఫెడ్ వడ్డీరేట్లు, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతంగా పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధరలు పతనం కాకపోయినా. మున్ముందు అలాంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గతంలో కూడా అనూహ్యంగా పెరిగిన తర్వాత పతనం అయిన సందర్భాలున్నాయి. అయితే.. తాజా పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.. ధరలు పెరుగుతున్నాయి.. తప్పితే తగ్గడం లేదు..

అయితే.. దసరా, దీపావళీ పండుగ సీజన్ల వేళ.. బంగారం ధరలు చుక్కలనుంటుతున్నాయి.. దసరా – దీపావళి వంటి ప్రధాన పండుగల సమయాల్లో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు.. ఇలాంటి సందర్భాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం పట్ల పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే.. తాజాగా.. కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. బంగారం ధర లక్షా 15 వేల మార్క్ దాటగా.. వెండి ధర రూ.లక్షన్నర మార్క్ కు చేరువైంది.. శనివారం సెప్టెంబర్ 27 ఉదయం నమోదైన ధరల ప్రకారం.. బంగారం పది గ్రాముల పై రూ.600 మేర ధర పెరగగా.. వెండి కిలోపై ఏకంగా రూ.6000 మేర ధర పెరిగింది..

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా..

24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.600 మేర ధర పెరిగి.. రూ.1,15,480 కి చేరుకుంది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై రూ.550 మేర ధర పెరిగి.. రూ.1,05,850 లకు చేరుకుంది.

వెండి కిలో ధర రూ.6000 లు పెరిగి.. రూ.1,49000 లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,15,480 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,05,850 ఉంది. కిలో వెండి రూ.1,59,000లకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములు రూ.1,15,480 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,05,850 ఉంది. కిలో వెండి రూ.1,59,000లకు చేరుకుంది.

భారతదేశంలో బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నుల ప్రకారం మారుతుంటాయి.. కారణం. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. అయితే.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. భవిష్యత్తులో బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *