ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ చనిపోయిన వ్యక్తి, చితిని కొడుతున్న వ్యక్తి ..ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన బాల్య స్నేహితులు. వీరు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు. అలాగే వీరు వ్యవసాయంలో కలిసి పనిచేసేవారు. రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి తన స్నేహితుడి నుంచి రూ.50,000 వేలు అప్పుగా తీసుకున్నాడు. కానీ తిరిగి చెల్లించకుంగానే మరణించాడు. ఇది తెలుసుకున్న అతని స్నేహితుడు. ఆగ్రహానికి లోనయ్యాడు.
గ్రామంలోని శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడి అతన స్నేహితుడి చితి కాలిపోతుండడం చూశాడు.. పక్కనే మృతుడి భార్య, పిల్లలు చితికి దగ్గరగా నిలబడి ఉండడం కనిపించింది. ఇక అక్కడే ఇక కర్రను చేత అందుకున్న ఆ వ్యక్తి వెంటనే చితి దగ్గరకు వెళ్లి మండుతున్న చితిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో చితిపై ఉన్న నిప్పురవ్వలు, కట్టెలు ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అక్కడే ఉన్న ఒక యువకుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఈ వీడియో కాస్తా వైరల్గా మారింది. అతను కర్రతో చితిని కొడుతూ, “అయ్యో, నా డబ్బు తిరిగి ఇవ్వలేదు” అని చెబుతున్నట్టు మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.