దక్షిణాదిలో పాపులర్ సెలబ్రెటీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులు కావడం విశేషం. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 14 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. కోలీవుడ్ హీరో సూర్యతో మొదటి సినిమాలో నటించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రీతి విజయ్ కుమార్. 1997లో వసంత్ దర్శకత్వం వహించిన నెహ్రూక్కు నేర్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు హీరో సూర్య. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన చండితోమ చిత్రంలో సూర్య సరసన నటించిన కొత్త హీరోయిన్ ప్రీతి విజయ్ కుమార్.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
ఇవి కూడా చదవండి
చండితోమ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది ప్రీతి విజయ్ కుమార్. ఆ తర్వాత 1997లో రుక్మిణి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 1998లో విజయకాంత్ సరసన ధర్మ చిత్రంలో నటించింది. 1999లో వచ్చిన పడయప్ప (నరసింహా) చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించింది. స్వయంవరం, కాక్కై సిరకినిలే, అల్లి అర్జున, పుంగనియ దేశం తదితర చిత్రాల్లో నటించారు. చివరగా 2002లో పుంగనీయ దేశం చిత్రంలో చివరిసారిగా నటించింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
అదే ఏడాది ఆమె దర్శకుడు హరిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. వ్యాపారరంగంలో రాణిస్తుంది. అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..