ఛీ.. ఛీ వీడసలు తండ్రేనా.. జేబులోంచి డబ్బులు తీసుకుందని.. కన్న కూతురినే..

ఛీ.. ఛీ వీడసలు తండ్రేనా.. జేబులోంచి డబ్బులు తీసుకుందని.. కన్న కూతురినే..


ఛీ.. ఛీ వీడసలు తండ్రేనా.. జేబులోంచి డబ్బులు తీసుకుందని.. కన్న కూతురినే..

తన జేబులోంచి డబ్బు దొంగిలించాడని 13 ఏళ్ల కూతురిని ఓ తండ్రి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. తన 13 ఏళ్ల కూతురిని గొంతు కోసి చంపిన కేసులో 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని బిచౌలా గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి సోనమ్ (13) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని వంతెన కింద పొదల్లో యూనిఫాంలో ఉన్న ఒక పాఠశాల బాలిక మృతదేహం కనిపించిందని బులంద్‌షహర్ పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటననపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గురువారం పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల సోనమ్‌ను స్కూల్‌ ముగిసిన తర్వాత తన తండ్రి తీసుకెళ్లినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే తండ్రి బాలికను ఇంటికి తీసుకెళ్లకుండా పొలం వైపునకు తీసుకెళ్లినట్టు గుర్తించారు. అక్కడ శర్మ తన కుమార్తెను పదునైన వస్తువుతో గొంతు కోసి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో విసిరేశానని తండ్రి విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా బాలిక బ్యాగ్‌ను పొలం నుండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే తన కూతురిని హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆ వ్యక్తి తన కూతురు బంధువుల ఊరికి వెళ్లిందని, మూడు, నాలుగు రోజులు పాఠశాలకు రాదని ఉపాధ్యాయులకు చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *