పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న హీరోయిన్. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చీరకట్టులో తన స్నేహితులతో కలిసి తరగతి గదిలో దిగిన ఫోటోను నెట్టింట పంచుకుంది. ఆమె ఎవరంటే..
ఆ బ్యూటీ మరెవరో కాదండి హీరోయిన్ శ్రియా శరణ్. భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. 2003లో జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్ నటించిన తుఝే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2001లో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.
తెలుగులో అగ్ర హీరోల జోడిగా వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఇక నెట్టింట శ్రియా చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.