Headlines

ఒకే ఒక్క అరెస్ట్‌.. హైకోర్టులో జైభీం మువీ సీన్‌ రిపీట్! ఇక పోలీసులకు దబిడిదిబిడే..

ఒకే ఒక్క అరెస్ట్‌.. హైకోర్టులో జైభీం మువీ సీన్‌ రిపీట్! ఇక పోలీసులకు దబిడిదిబిడే..


నెల్లూరు జిల్లాకు చెందిన సౌందర్ రెడ్డి తాడేపల్లి వచ్చి చెన్నై కలకత్త జాతీయ రహదారి సమీపంలో రోడ్డు పక్కన జ్యూస్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తాడేపల్లి పాతూరు రోడ్డులో సౌందర్ రెడ్డిని పోలీసులమని చెప్పి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించగా.. యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేస్తున్నామని, తాము తాడేపల్లి పోలీసులమనీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీనితో తాడేపల్లి పోలీసులను సౌందర్ రెడ్డి భార్య ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. 100కు కాల్ చేసిన పోలీసులు స్పందించలేదు. దీనితో ఆమె నేరుగా ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనితో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ రఘునందన రావు, జస్టిస్ చంద్ర దనశేఖర్ల ధర్మాసనం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట పోలీసులమని చెప్పి అరెస్టు చేశారని కోర్టుకు బాధిత కుటుంబ సభ్యులు తెలపగా పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదని ఏపీ హై కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వ తరపు న్యాయవాదులు, హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుడు ఎక్కడ ఉన్నారో 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలని, అలాగే ఏ కేసులో అయినా అరెస్టు చేస్తే ఆ కేసుకు సంబంధించిన వివరాలతో ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దని హై కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే సౌందర్ రెడ్డి తమ అదుపులో లేడని హైకోర్టుకు నివేదించారు. అయితే అనూహ్యంగా 23వ తేదీన గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దీనితో హైకోర్టులో బాధితుడి బార్య ఆధారాలతో సహా లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడంతో 24వ తేదీన తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించింది. పైగా తమ అదుపులో లేరని తాడేపల్లి పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మిస్సింగ్ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసులో వాస్తవాలు ఏంటో తేలుస్తామని విచారించిన ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడింది.

సౌందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని ఎండగట్టిన ఏపీ హైకోర్టు.. మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించింది. 22వ తేదీన 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్న నాటి నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మొత్తం సీసీ కెమెరాలను ఫుటేజ్, పోలీసుల అదుపులో ఉన్న రెండు రోజుల సెల్ టవర్ లొకేషన్ సైతం తమ ముందు ఉంచాలని టెలికాం కంపెనీనీ ఆదేశించింది. దీనితో కోర్టు ఆదేశాలతో అన్ని ఆధారాలను కోర్టు పరిశీలించడంతో పోలీసుల తీరును తప్పుపట్టింది. అక్రమంగా అరెస్టు చేయడం యూనిఫారం లేకుండా అరెస్టు చేయడం, హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన కూడా గంజాయి కేసులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం లాంటి అంశాలను పరిశీలించి తీవ్రంగా మండిపడింది. హై కోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు పట్టవా అంటూ పత్తిపాడు సీఐను నేరుగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో అదుపులోకి తీసుకుంటున్నారు? ఇదేం సంస్కృతి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ కేసును మూడు రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ఏపీ హైకోర్టు ఎన్నడూ లేని విధంగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సౌందర్ రెడ్డి అరెస్టును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, అన్యాయంగా గంజాయి కేసులో ఇరికించారని హైకోర్టులో న్యాయమూర్తుల ఎదుట భావోద్వేగానికి గురవడంతో ఈ కేసులో అస్సలు వాస్తవాలు ఏంటో తేల్చాలని విశాఖ సీబీఐ యూనిట్ ను ఆదేశించింది. పౌరులను అక్రమంగా అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోమని నిజా నిజాలు ఏంటో తేల్చాలని CBIకి కేసును అప్పగించింది. సౌందర్ రెడ్డిని 22వ తేదీన అదుపులోకి తీసుకున్న పత్తిపాడు పోలీసులు తమ అదుపులో లేడని చెప్పడం, పోలీసుల వెర్షన్, బాధితుడు సీసీ ఫుటేజ్, సెల్ లొకేషన్లు బిన్నంగా ఉండటం, పత్తిపాడు పోలీసులు గంజాయి కేసు నమోదు చేయడం, తమ ఆదేశాలకు విరుద్ధంగా లోకల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం, 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం వ్యవహారంలో పోలీసులు కోర్టుకు నివేదించిన అంశాలు భిన్నంగా ఉండడంతో సీబీఐకి అప్పగిస్తూ వచ్చే నెల 13వ తేదీలోపు కేసులో వాస్తవాలను విచారించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

మొత్తానికి ఏపీ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. అక్రమ అరెస్టుల విషయో తొలిసారి ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిన తరువాత పోలీసులు నిజంగా తప్పు చేసినట్లు తేలితే హై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో సీబీఐ విచారణ ఎలా జరగబోతుంది, దీనిపై సీబీఐ ఏ నివేదిక ఇస్తుంది అనేది వేచి చూడాలి.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *