శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన ఒక భక్తుడు మెడ నిండా బంగారు నగలు ధరించి కనిపించాడు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. హైదరాబాద్ కు చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్ దాదాపు 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి ఆలయం ముందు తళుక్కుమన్నాడు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల కంటపడ్డాడు. శ్రీవారి దర్శనం చేసుకొని ఆలయం బయటకు వచ్చిన విజయ్ కుమార్ ను చూసిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మెడ నిండా బంగారు గొలుసులు, రెండు చేతులకు కడియాలు, ఉంగరాలతోపాటు.. బంగారు వాచ్ ను విజయ్ కుమార్.. ధరించాడు.. ఇలా ఆరు కిలోలకు పైగా బంగారు ఆభరణాలతో బంగారు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న విజయ్ కుమార్.. తరచూ తిరుమలలో కనిపిస్తూ సందడి చేస్తు