సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పారు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తరువాత, ‘మూండు ముడిచ్చు’ చిత్రంతో పాపులర్ అయ్యారు. తొలినాళ్లలో నటుడు రజనీకాంత్ ఎక్కువగా నెగటివ్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత ‘కవికుయిల్’ సినిమాతో హీరోగా నటించడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇప్పటివరకు 100పైగా సినిమాల్లో నటించారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్రవేశారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సహా అనేక భాషల చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఇటీవల నటించిన ‘కూలీ’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే రజినీ సినిమాలో ఛాన్స్ కోసం అందరూ హీరోయిన్స్ ఎదురుచూస్తుంటారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం రజినీతో నటించేందుకు ఒప్పుకోలేదు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు రజినీ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య రాయ్. మొదట్లో ఆమెను పడయ్యప్ప (నరసింహా) చిత్రంలో నీలాంబరి పాత్రకు తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె మరో సినిమాతో బిజీగా ఉంది. ఆ తర్వాత బాబా చిత్రంలో హీరోయిన్ గా నటించాలని కోరగా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ ఆఫర్ మనీషా కొయిరాల వద్దకు చేరింది. ఆ తర్వాత శివాజీ చిత్రం, చంద్రముఖి సినిమాల కోసం ప్రయత్నాల జరగ్గా.. అవి సఫలం కాలేదు. చివరగా డైరెక్టర్ శంకర్ కోరడంతో రోబో చిత్రంలో రజినీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

Aishwarya Rai
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..