మెగాస్టార్ చిరంజీవి.. సినీరంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడితో కలిసి మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీస్ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే చిరు కెరీర హిట్లర్ కు ముందు ఒకలా.. హిట్లర్ తర్వాత మరోలా సాగింది. ఈ సినిమా తర్వాత చిరు కెరీర్ లో వచ్చిన మరో హిట్ మూవీ చూడాలని ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చూడాలని ఉంది చిత్రంలో సౌందర్య, అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ హిట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి
చిరుతో నటించిన హీరోయిన్ అంజలి ఝవేరి గుర్తుందా.. ? అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్. తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున జోడిగా రావోయి చందమామ సినిమాలో నటించింది. అప్పట్లోనే చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జునతో కలిసి హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత అంజలి ఝవేరి ఫాం తగ్గింది. ఆమెకు అవకాశాలు తగ్గడంతో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు పోషించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో నటించిన నటుడిని పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు తరుణ్ అరోరా. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో తరుణ్ అరోరా విలన్ గా నటించారు. అలాగే భోళా శంకర్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అంజలి ఝవేరి.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..