India vs Sri Lanka, Super Fours, 18th Match (A1 v B1): 2025 ఆసియా కప్లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ మిస్ అవ్వగా, అభిషేక్ వర్మ హాట్రిక్ హాఫ్ సెంచరీతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
హార్దిక్ పాండ్యా 2 పరుగులకే ఔటయ్యాడు. దుష్మంత చమీర తన సొంత బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజు సామ్సన్ (39 పరుగులు)ను చరిత్ అసలంక, అభిషేక్ శర్మ (61 పరుగులు)ను వనిందు హసరంగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 పరుగులు)ను శుభ్మాన్ గిల్ (4 పరుగులు)ను మహీష్ తీక్షణా అవుట్ చేశారు.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి.
ఇవి కూడా చదవండి
శ్రీలంక: పాతుమ్ నిశంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుసార.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..