కోనసీమ ముఖద్వారం రావులపాలెం పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది జాతీయస్థాయి ఖ్యాతినార్జించిన అరటి మార్కెట్. ఇక్కడి రైతులు వేల ఎకరాల్లో అరటి పంటను సాగు చేస్తూ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా అరటి ఉత్పత్తులు అధికంగా చేయడం వల్ల వేలాది మంది రైతులు, రైతు కూలీలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇక్కడి రైతులు సేద్యం చేస్తున్న అరటి రకాల్లో ఎర్రచక్రకెళ్ళి రకం విశేష ఆదరణ పొందుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, అయినవిల్లి, అంబాజీపేట తదితర మండలాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లా లోని పెరవలి, పెనుగొండ మండలాల్లో చక్రకేళి, బుషవలి, కర్పూర, బొంత, అమృతపాని, ఎర్ర చక్రకేళి వంటి రకాలు సుమారు 6000 ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు.కాగా ఎర్రచక్రకెలికి సింగపూర్, దుబాయ్, మలేసియా వంటి దేశాలలో క్రేజ్ ఉంది. దీంతో మద్రాస్, హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాలద్వారా ఈ ఎర్ర చక్రకేళి విదేశాలకు ఎగుమతి అవుతుంది.
1000 ఎకరాల్లో ఎర్ర అరటిసాగు
కోనసీమలో మొత్తం వివిధ అరటి రకాలు 6000 ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో గిరాకీ దృష్ట్యా మొత్తంగా పెద్ద మొత్తంలో 1000 ఎకరాల్లో ఈ ఎర్ర చక్రాకేలీ సాగుచేస్తూ లాబాల బాటలో నిలుస్తున్నారు. ఈ ఎర్రచక్ర కేలీ రకం అరటి గెలలకు మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు సీజన్ కాక ఆ సీజన్లో ఒక్కొక్క అరటి గెల 500 నుంచి 600 రూపాయలు వరకు ధర పలుకుతుంది. అన్ సీజన్లో అంటే సెప్టెంబర్ నుంచి మరల మార్చ్ వరకు ఒక్కో గల 300 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఇలా సీజన్ అన్ సీజన్లలో ధరలు గిట్టుబాటు కావడంతో రైతన్నలు ఈ పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రంగు…రుచిలో కొత్తదనం
సాధారణ అరటి పంటలకు రైతుకు ఎకరాకు రూ ఒక లక్ష నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుండగా ఈ ఎర్రచక్రకెళ్ళి రకానికి మాత్రం ఎకరాకు
రూ.4 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. అయితే ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఈ ఎర్రచక్రకెళ్లి అరటి పండుకు మంచి ఆదరణ లభిస్తుండడం లాభాలు వస్తుండడంతో రైతులు ఈ ఎర్రచక్రకేళి సాగు చేస్తున్నారు. రంగులో ఈ అరటిపండు ఎర్రగా ఎంతో అందంగా కనిపిస్తుంది… అలాగే రుచిలో తక్కువ స్వీట్ కలిగి యాపిల్ టెస్ట్ ను కలిగి ఉంటుంది. అందువల్లే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రజలు, విదేశిస్తులు ఎర్రచక్రకేళి రకాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. సాధారణ అరటిపండు 100శాతం తీపి దనం కలిగి ఉంటే ఈ ఎర్రచక్రకెళ్లి రకం 25శాతం మాత్రమే తీపి తో ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్లు కూడా ఈ ఎర్రచక్ర కేలిని తింటున్నారని రైతులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..