అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారిని దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. లక్ష్మీదేవి అలంకరణలో భాగంగా కరెన్సీ అమ్మవారుగా దర్శనమిస్తున్నారు .. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి..నీ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు…అమలాపురంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది…అమ్మవారి కి అలంకరణతో పాటు ఆలయం మొత్తం కొత్త నోట్లతో అలంకరణ చేశారు… రూ. 4కోట్ల 42 లక్షల రూపాయలతో విశేషంగా అమ్మవారిని అలంకరించడంతో ఇన్ని కోట్ల రూపాయలు అమ్మవారు రూపంలో చూసుకొని దర్శించుకుంటున్నారు భక్తులు….ఆలయ నిర్వహకులు.5, 10,20,50,100,200,500 రూపాయల నోట్ల కట్లలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.
ఆలయం మొత్తం నోట్ల కట్టలతో అలంకరించారు నిర్వాహకులు.కరెన్సీ మాతగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చిస్తున్నారు… . అమ్మవారిని దర్శించుకుని వెళ్లే భక్తులకు కానుకగా ఒక కొత్త రూపాయి కాయిన్ ను అమ్మవారి వద్ద ఉంచి అనంతరం రూపాయి కాయిన్ ను భక్తులకు ఉచితంగా వితరణ చేస్తున్నారు ఆలయ నిర్వహకులు.
గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది విజయదశమి నవరాత్రుల్లో లక్ష్మీదేవి అలంకరణ రోజున కోట్ల రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేయడం ఆనవాయితీగా ఇక్కడ వస్తుంది.. వత్తు వర్మ ఒత్తు ఒత్తు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్న సినిమా డైలాగు తరహాలో వాసవి మాత అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చూస్తుంటే ఆ విధంగా అందరి కళ్ళు చెదిరిపోతున్నాయి. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఫోటోలు తీసుకొని ఫోన్లలో వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..