తెలుగు రాష్ట్రాల్లో OG సినిమా విడుదలైనప్పటి నుండి టికెట్ల పెంపు వివాదం కొనసాగుతోంది. ఇది OG చిత్రానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తం సినిమా పరిశ్రమ సమస్య అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. టికెట్ల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు కాగా, సింగిల్ బెంచ్ టికెట్ ధరలు పెంచవద్దని తీర్పు ఇచ్చింది. అయితే, డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై స్టే విధించి, OG యూనిట్‌కు తాత్కాలిక ఊరట కల్పించింది. తమ వాదనను వినకుండా తీర్పు ఇచ్చారన్న సినిమా యూనిట్ అభ్యర్థనను మరోసారి పరిశీలించాలని డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జికి సూచించింది. మరోవైపు, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి టికెట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. OG టికెట్ల పెంపు తనకు తెలియదని, ఇకపై నిర్మాతలు తమ వద్దకు టికెట్ల పెంపు కోసం రావద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు ఉండవని, చిన్న, పెద్ద సినిమాలను సమానంగా చూస్తామని ఆయన ప్రకటించారు. సామాన్య ప్రేక్షకుడికి సినిమాను దూరం చేయవద్దని మంత్రి కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Heavy Rain Alert: మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో మరింత పతనమైన టమాటా ధర
ములుగు జిల్లాలో ఉధృతంగా బొగత జలపాతం
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్