తెలంగాణ హైకోర్టులో ఓజీ సినిమా టికెట్ ధరల వ్యవహారంపై వాదనలు కొనసాగుతున్నాయి. డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో ఈ కేసును సింగిల్ బెంచ్ తిరిగి విచారిస్తోంది. ఈ పిటిషన్‌లో సినిమా థియేటర్స్ అసోసియేషన్ తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యి తమ వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి తన వాదనల్లో దిల్జిత్ సింగ్ ఈవెంట్‌లు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల ధరలను ప్రస్తావించారు. ఈవెంట్ టికెట్లు లక్షల్లో అమ్ముడవుతున్నప్పుడు, ఐపీఎల్ టికెట్లు వేలల్లో ఉన్నప్పుడు పిటిషనర్లు కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను నియంత్రించే అధికారం సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం కలిగి ఉందని ఆయన గుర్తుచేశారు. గతంలో భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఓజీ సినిమా విషయంలోనూ షో సమయాన్ని, టికెట్ ధరను (1000 నుండి 800 రూపాయలకు) ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అక్టోబర్ 4 తర్వాత సాధారణ రేట్లు (295 రూపాయలు) అందుబాటులో ఉంటాయని, మొదటి రోజే సినిమా చూడాలని, తనకు నచ్చిన ధరకే చూడాలని పట్టుబట్టడం సరికాదని నిరంజన్ రెడ్డి వాదించారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jal Prahar-25: కాకినాడ తీరంలో జల్ ప్రహార్ 2025 విన్యాసాలు
మిగ్ 21 యుద్ధ విమానాలకు తుది వీడ్కోలు
ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు
టిక్కెట్ల పెంపు అనేది OG సమస్య కాదు.. ఇండస్ట్రీ సమస్య
Heavy Rain Alert: మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC