భారత వాయుసేనలో దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్ 21 యుద్ధ విమానాలకు తుది వీడ్కోలు పలికారు. చండీగడ్ ఎయిర్ బేస్ లో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు ఎయిర్ చీఫ్ మార్షల్ చివరి ఫ్లైట్ నడిపి, మిగ్ 21 విమానాలకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వాటర్ సల్యూట్ తో గౌరవ వందనం సమర్పించారు. భారత వాయుసేనలో ఇప్పటివరకు 1200 మిగ్ యుద్ధ విమానాలు సేవలందించాయి. సుమారు 60 ఏళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన మిగ్ 21 వార్ జెట్స్, ఇటీవల కాలంలో వరుస ప్రమాదాల కారణంగా వార్తల్లో నిలిచాయి. ఈ ప్రమాదాలు మిగ్ 21 విమానాల భద్రతపై ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా 2023లో రాజస్థాన్ లో జరిగిన ప్రమాదం తర్వాత మిగ్ 21 సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. వరుస ప్రమాదాలతో ఎగిరే శవపేటికలు అనే చెడ్డ పేరును సంపాదించుకున్న మిగ్ 21 విమానాలకు తుది వీడ్కోలు పలకాలని వాయుసేన నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు
టిక్కెట్ల పెంపు అనేది OG సమస్య కాదు.. ఇండస్ట్రీ సమస్య
Heavy Rain Alert: మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో మరింత పతనమైన టమాటా ధర