ఆసియా కప్ 2025 లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం జనిత్ లియానేజ్‌కు జట్టు అవకాశం ఇవ్వగా, భారత జట్టు రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, శివం దుబేలకు విశ్రాంతి ఇచ్చారు. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించగా, శ్రీలంక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి రేసు నుంచి నిష్క్రమించింది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
ఇవి కూడా చదవండి
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి.
శ్రీలంక: పాతుమ్ నిశంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుసార.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..