Viral Video: హోటల్‌లో మరో వ్యక్తితో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది.. తర్వాత మాములు ట్విస్ట్ కాదు

Viral Video: హోటల్‌లో మరో వ్యక్తితో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది.. తర్వాత మాములు ట్విస్ట్ కాదు


సమాజం ఇప్పుడు ఎంతలా దిగజారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలు. సమాజంలో క్రైమ్ రేట్ పెరగడానికి కూడా ఇవే కారణం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా మనుషుల్ని చెడ్డగొట్టడంలో.. బయటివాళ్లకు కనెక్ట్ అవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తాజాగా హర్యానాలోని జింద్ ప్రాంతంలో తీసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో ఒక వ్యక్తి హోటల్ గదిలోకి బలవంతంగా వెళ్లి..లోపల మరొక వ్యక్తితో ఉన్న తన భార్యను గుర్తించడం సంచలనంగా మారింది. వీడియోలోని వ్యక్తిని రాకేష్‌గా గుర్తించారు. హోటల్‌లోకి ప్రవేశించే ముందు అతను తీవ్రమైన మనోవేదనలో కనిపించాడు. “నా జీవితం నాశనం అయింది” అని వీడియో రికార్డ్ చేసిన వ్యక్తికి కూడా చెప్పాడు. కొంతమంది వ్యక్తులతో అతను హోటల్ రిసెప్షన్ వద్దకు పరుగెత్తాడు. గది నంబర్ అడిగి పైకి వెళ్లాడు. ఆపై తలుపు తెరిచే వరకు పదే పదే కొట్టాడు.

డోర్ తెరిచన తర్వాత.. లోపల అతని భార్య మరొక వ్యక్తితో కనిపించింది. కోపంతో ఉన్న రాకేష్ అందరికీ.. స్పష్టంగా కనిపించేలా లైట్లు వేయమని డిమాండ్ చేశాడు. అతని గొంతులో ఎంతో బాద, నైరాశ్యం కనిపించాయి. ఇలా వాగ్వాదం జరుగుతుండగా… రాకేశ్ తన భార్యతో ఉన్న వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నించగా.. ఆమె భర్తను దూరంగా నెట్టడం వీడియోలో కనిపించింది. రెండు రోజుల క్రితం షేర్ చేయబడిన ఈ వీడియో.. సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.

“నువ్వు పోలీసులను పిలిచి తప్పు చేస్తున్నావు. వాళ్లు వస్తే ఈ విషయం కోర్టుకు వెళుతుంది. కోర్టు కూడా వారిద్దరికీ సమ్మతి ఉంటే.. ఎలాంటి క్రైమ్ కాదని చెప్పింది. పైగా గృహ హింస, హత్యాయత్నం ఆరోపణలపై ఆమె నిన్ను జైలుకు పంపుతుంది” అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. “ఈ జనరేషన్‌లో పెళ్లి అనే బంధానికి విలువే లేకుండా పోతుంది” అని మరో యూజర్ రాసుకొచ్చారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *