Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?


తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్స్ ను స్థాపించిన దగ్గుబాటి రామానాయుడు 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత ఆయన వారసుత్వాన్ని కొనసాగిస్తూ దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సురేశ్ బాబు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ బాధ్యతలు చూసుకుంటూ టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక వెంకటేష్ స్టార్ హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు. ఇక దగ్గుబాటి మూడో తరమైన దగ్గుబాటి రానా, అభిరామ్ లు కూడా కూడా హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అహింస సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభిరామ్ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కాబట్టి ప్రస్తుతం దగ్గుబాటి వంశంలో యాక్టివ్ హీరోలంటే వెంకటేష్, రానాలు అనే చెప్పుకోవచ్చు. సీనియర్ హీరోగా వెంకటేశ్ వరుసగా సినిమాలు చేస్తుంటే.. రానా మాత్రం హీరోగా, విలన్ గా, నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు.

వెంకటేష్, రానాలు కలిసి ఆ మధ్యన రానా నాయుడు అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లోనూ నటించారు. అంతకు ముందు రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకటేశ్ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు. అయితే ఈ ఇద్దరి హీరోలతోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ అంటే లేడీ సూపర్ స్టార్ నయన తారనే అని చెప్పుకోవచ్చు. వెంకటేశ్- నయనతారలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన లక్ష్మి, తులసి గా సూపర్ హిట్ కాగా, బాబు బంగారం మాత్రం యావరేజ్ గా నిలిచింది.

ఇదే నయనతార కలిసి కృష్ణం వందే జగద్గురమ్ సినిమాలో రానా దగ్గుబాటితో రొమాన్స్ చేసింది. బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా కూడా వెంకటేష్, రానాలిద్దరితోనూ కలిసి నటించింది. వెంకీ నటించిన సుభాష్ చంద్రబోస్, రానా నా ఇష్టం సినిమాల్లో జెనీలియా కథానాయికగా కనిపించింది. అలా అబ్బాయి, బాబాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్లుగా నయనతార, జెనీలియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే టాప్ హీరోయిన్ అంటే మాత్రం నయనతారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సినిమాలు చేస్తోందీ అందాల తార. మరోవైపు జెనీలియా ఇప్పుడు సహాయక నటిగా అలరిస్తోంది. ఇటీవల జెన్నీ నటించిన జూనియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది.

భర్త, పిల్లలతో హీరోయిన్ నయనతార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *