ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ కి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది. విజయవాడలో అమ్మాయిల హత్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక సైకో కిల్లర్ నగరంలోని అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యం దారుణంగా హతమారుస్తుంటాడు. అమ్మాయిల తల, మొండెంను వేరు చేసి చంపుతూ పోలీసులకు సవాల్ విసురుతాడు. దీంతో ఈ సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆమె విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఒకనొకదశలో సైకో కిల్లర్ కారణంగా పోలీసాఫీసర్ జీవితం తలకిందులు అవుతుంది. ఉద్యోగానికి కూడా రాజీనామా చేయల్సి వస్తుంది. అయితే నగరంలో హత్యలు మరింత పెరిగిపోతాయి. దీంతో పోలీసు డిపార్ట్ మెంట్ తో సంబంధం లేకుండా సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు హీరోయిన్ ప్రయత్నాలు చేస్తుంది.
ఈ క్రమంలోనే ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే సైకో కిల్లర్ మోటివ్స్ బయటపడతాయి. మరి హీరోయిన్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకుందా? అసలు ఆ కిల్లర్ గతం ఏమిటి? ఆడవాళ్లనే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు? పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు దక్షిణ. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు కాబోయే భార్య ధన్సిక ఇందులో ఏసీపీగా లీడ్ రోల్ పోషించడం విశేషం. అలాగే రిషభ్ బాసు, మాగ్నా, కరుణ, అంకితా ములెర్, హిమా సైలజా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించారు. సుమారు 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Lionsgate Play ఓటీటీ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ చిత్రాలను ఇష్టంగా చూసేవారికి దక్షిణ ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.