నిమ్మకాయ నీరు విటమిన్ సి, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి సహజ శక్తి పానీయంగా పనిచేస్తుంది. దీని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మీ వ్యవస్థ శుభ్రం అవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. బరువు పెరగడానికి కష్టపడుతున్నవారికి.. నిమ్మరసం ఒక సహజమైన సహాయంగా చెప్పవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. క్రేవింగ్స్ తగ్గిస్తుంది.కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం తగ్గిస్తుంది. ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మొటిమలను తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా, స్పష్టంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
నిమ్మరసం రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇది కిడ్నీలను శుభ్రపరచి, ఆరోగ్యంగా ఉంచుతుంది.
నిమ్మకాయ నీరు తాజా శ్వాసను అందించడమే కాకుండా, కావిటీస్, పంటి నొప్పి, చిగురువాపు వంటి దంత సమస్యలను కూడా నివారిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం ఉత్తమం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోజంతా శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది.