తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. . ఏప్రిల్‌లో దీన్ని విచారించిన కోర్టు.. 2 కోట్ల రూపాయలతో పాటు, చిత్రంలో క్రెడిట్‌ను పిటిషన్‌దారుడికి అందించాలని ఎ.ఆర్.రెహమాన్, మద్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ రెహమాన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసులో సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కు ఊరట లభించింది. ‘వీరా రాజ వీరా’ పాటపై సింగిల్ బెంచ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. జస్టిస్ హరిశంకర్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 25న ఈ కేసు విషయంలో తీర్పు చెప్పింది. ఈ పాట జాహిరుదీన్ డగర్ సోదరులు కంపోజ్ చేసిన శివస్తుతి పాటను పోలి ఉందని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేడు ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై రెహమాన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెడుతున్నట్లు తెలిపింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!
Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం
తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..
ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా
ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా