హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..

హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..


ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. మద్యం పురుషులే కాదు మహిళలు కూడా ఎక్కువగానే తాగుతున్నారు. అవును, వినడానికి కాస్త షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది నిజమేనంటున్నాయి గణాంకాలు. భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అధికంగా మద్యం సేవించటంలో ముందంజలో ఉన్నారు. ఇండియాలో ఏయే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు డ్రింక్‌ చేస్తున్నారు.. వారిలో ఎక్కువగా తాగుతుంది ఏ రాష్ట్ర లేడిసో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తారట. అరుణాచల్ ప్రదేశ్​లో 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత స్థానంలో సిక్కింలో 16.2 శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారట. సిక్కిం తర్వాత అస్సాంలోని 7.3 శాతం మంది అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు. సిక్కింలో మద్యం తయారు చేసే, తాగే ఒక పురాతన సాంప్రదాయం ఉంది. ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందింది.

అస్సాం తర్వాత మేఘాలయ ఉంది. ఇక్కడ అదే వయసు గల 8.7శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు నివేదిస్తున్నారు. అస్సాం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో 6.7 శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట. ఆశ్చర్యకరంగా పెద్ద కార్పొరేట్ రంగాలకు పేరుగాంచిన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *