Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..? తినండి బాగా తినండి.. షెడ్డుకే

Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..?  తినండి బాగా తినండి.. షెడ్డుకే


Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..?  తినండి బాగా తినండి.. షెడ్డుకే

కొందరు అయితే పానీ పూరిని యమ ఇష్టంగా తింటారు. ప్రస్తుతం రెయినీ వెదర్ ఉంది కాబట్టి.. చాలామంది మనసు పానీపూరి వైపే గుంజుతుంది. మీరు కూడా పానీ పూరీ లవర్స్ అయితే ఈ వీడియోను చూడాల్సిందే. చాలామందికి పానీపూరిని చూడగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ ఇక్కడ పానీ పూరీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే కడుపుతో దేవడం పక్కా.

గతంలో  అపరిశుభ్ర వాతావరణంలో పానీపూరి తయారు చేస్తున్న ఘటనలు చాలా చూశాం. ఇది కూడా అలాంటి వీడియోనే. ఈ వీడియో చూశాక  భవిష్యత్తులో పానీపూరి తినాలంటే మీరు ఒకటికి.. రెండుసార్లు ఆలోచిస్తారు. వీడియోలో ఒక వ్యక్తి తన ఇంటి బయట మురికి ప్రదేశంలో బహిరంగంగా కూర్చుని పానీపూరీ కోసం పిండిని తయారు చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అతను పిండిని బంతులుగా పిసుకుతూ పరిశుభ్రతను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే.

“మార్కెట్‌లో ఇప్పటికే విస్తృతంగా ఆహారం కల్తీ జరుగుతోంది. కల్తీ ఆహారం తినడం తప్ప మనకు వేరే మార్గం లేదు” అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘అసలు జనం తినే ఫుడ్‌ను ఇలా చేస్తే వారికి పాపం తగలదా’ అని మరొకరు కామెంట్ పెట్టారు. ‘అందుకే బయట ఫుడ్ తినను. మన ఇంట్లో మనం ఫుడ్ చేసుకుంటే ఏ బాధలు ఉండవు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

 

View this post on Instagram

 

A post shared by sumit (@sumit3838)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *