Allu Sirish: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో అల్లు శిరీష్! అమ్మాయి ఎవరంటే?

Allu Sirish: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో అల్లు శిరీష్! అమ్మాయి ఎవరంటే?


మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందాడు. అయితే అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. అయితే వీరిలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధ్ లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1971: బియాండ్ బార్డర్స్, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడీ అల్లు హీరో. అయితే ఎందుకోగానీ స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయాడు. బడ్డీ సినిమా రిలీజై ఏడాదిపైనే అయ్యింది. అయితే ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు శిరీష్. సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే అల్లు శిరీశ్ పెళ్లి చేసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకున్నారని సమచారం.

కాగా ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నం కన్నుమూశారు. దీంతో అల్లు శిరీష్ పెళ్లిని వాయిదా వేశారని టాక్. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో శిరీశ్ వివాహం గురించి ఒక ప్రకటన అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అల్లు శిరీష్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరోవైపు అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ సుమారు రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

మెగా, అల్లు హీరోలందరూ ఒకే చోట..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *