మరోవైపు డార్లింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మాత్రం ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. సీటీమార్ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆరడగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా సినిమాలన్నీ ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. అయితే గతేడాది రిలీజైన విశ్వం మాత్రం యావరేజ్ గా నిలిచింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ గోపీచంద్ కెరీర్ ను కాస్త గాడిలో పెట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్రెండ్స్.. యువీ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ ను నడుపుతున్నారు. ఈ బ్యానర్ లో తెరకెక్కే సినిమాల విషయంలో ప్రభాస్ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్ గా లేకపోయినప్పటికీ ఆయన సలహాలు సూచనలు మాత్రం తప్పక ఉంటాయి. అలా సుమారు పదేళ్ల క్రితం ఒక సినిమా కథ ప్రభాస్ దగ్గరకు వచ్చిందట. కొత్త దర్శకుడు అయినా కథ బాగా నచ్చిందట. అయితే అప్పటికే తాను బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నాడట. దీంతో డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేని ప్రభాస్ ఇదే సినిమా కథను తన స్నేహితుడు గోపీచంద్‌ను చేయమని చెప్పాడట. ప్రభాస్ సూచనల మేరకు గోపీచంద్ కూడా కథ విన్నాడట. అతనికి కూడా స్టోరీ తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే ఓకే చెప్పాడట. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కడం, సూపర్ హిట్ అవ్వడం చకా చకా జరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో గోపీచంద్ అప్పీయరెన్స్ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు మ్యాచో స్టార్. ఇప్పటికే ఆ సినిమా ఏదో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. యస్. ఆ మూవీ పేరే… జిల్. 2014లో రిలీజైన గోపీచంద్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ జిల్. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. కాగా దీని తర్వాత ఇదే రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ అనే సినిమా చేశాడు ప్రభాస్. కానీ.. ఈ మూవీ మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా
ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా
స్పైడర్ మ్యాన్‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
ఏంటి! ‘కాంతార 2’ చూసేందుకు మద్యం, మాంసం తినకుండా వెళ్లాలా? రిషబ్ షాకింగ్ ఆన్సర్
40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్