బాహుబలి 2తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క.అనుష్క తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్ధం, ఘాటీ లాంటి సినిమాలు చేసారు. కానీ ఇందులో వర్కవుట్ అయిన సినిమాలు తక్కువే.. తెలుగులో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మాత్రం బాగా ఆడింది. పూజా హెగ్డే కూడా తెలుగులో మాత్రమే నటించినన్ని రోజులు తిరుగులేదు.. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసారు. కానీ రాధే శ్యామ్, బీస్ట్ అంటూ ప్యాన్ ఇండియా వైపు వెళ్లి వెనకబడిపోయారు. హిందీ కూడా ఈమెకు కలిసిరాలేదు. మొన్నొచ్చిన కూలీ కూడా అంతే సంగతులు.. మోనికా పాట హిట్టైనా పూజా కెరీర్‌కు ఇది ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. సమంత సైతం తెలుగులో ఉన్నపుడు క్వీన్. అలా కాకుండా ప్యాన్ ఇండియా అన్నపుడే సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఖుషీ తర్వాత తెలుగులో కనబడలేదు స్యామ్. ఇక తమన్నా హీరోయిన్‌గా మానేసి స్పెషల్ సాంగ్స్‌పై ఫోకస్ చేసారు. ప్యాన్ ఇండియా కల్చర్ తట్టుకుని.. సస్టైన్ అవుతున్నది రష్మిక మందన్న మాత్రమే. ఇంకెన్నాళ్లు ఈమె దూకుడు సాగుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పైడర్ మ్యాన్‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
ఏంటి! ‘కాంతార 2’ చూసేందుకు మద్యం, మాంసం తినకుండా వెళ్లాలా? రిషబ్ షాకింగ్ ఆన్సర్
40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్
మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్
మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు