స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన

స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన


మరి స్పైడర్‌ మ్యాన్‌ లెక్కనే వేషధారణ, ఎగరడం, నడవడం వంటి పనులు చేసే ఆకతాయిల గురించి వేరేగా చెప్పాల్సిన పనేలేదు. అటు.. మార్కెట్లో స్పైడర్‌ మ్యాన్‌ టాయ్స్‌కు ఉండే డిమాండ్‌ కూడా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు సీక్వెల్‌గా వస్తున్నాయి. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయినట్లు నెట్టింట్లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. గాయం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందనేది దాని సారాంశం. హార్ట్‌ఫోర్‌షైర్, వాట్‌ఫోర్డ్‌లో ఉన్న లీవెస్‌డెన్ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతుండగా టామ్ పైనుంచి కిందపడిపోవడంతో తలకు గాయం అయింది. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారట. హీరో టామ్ ఆస్పత్రి పాలు కావటంతో స్పైడర్‌ మ్యాన్‌ సినిమా షూటింగ్‌ వాయిదా పడేయాల్సి వచ్చింది. మరికొన్ని రోజుల్లో టామ్ కోలుకోగానే మళ్లీ షూటింగ్‌ యథావిధిగా సాగుతుంది. కాగా, బ్రాండ్ న్యూడే షూటింగ్ ఆగస్టు నెలలో షురూ అయింది. 2026, జులై 31వ తేదీన సినిమా విడుదల చేసేందుకు ప్లాన్‌ వేశారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌ వాయిదా పడిన నేపథ్యంలో విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి! ‘కాంతార 2’ చూసేందుకు మద్యం, మాంసం తినకుండా వెళ్లాలా? రిషబ్ షాకింగ్ ఆన్సర్

40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్

మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్

మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *