Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!

Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!


Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!

తత్కాల్ బుకింగ్ విండో తెరవగానే సెకన్లలో సీట్లు మాయమవుతుంటాయి.  అలా పేమెంట్ చేసేలోపే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతాయి. అయితే కష్టపడకుండా ఈజీగా తత్కాల్ బుక్ చేసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే..

ఐఆర్‌‌సీటీసీ అకౌంట్

తత్కాల్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని.. పాసింజర్ డీటెయిల్స్, ఇతర వివరాలన్ని ముందే ఫిల్ చేసి ఉంచుకోవాలి. మీ టికెట్ కు అయ్యే మొత్తాన్ని ఐఆర్ సీటిసీ వ్యాలెట్ లోకి యాడ్ చేసుకుని రెడీగా ఉండాలి. పది నిముషాల ముందే లాగిన్ అయ్యి రెడీగా ఉండి ట్రైన్ నెంబర్ తో సెర్చ్ చేస్తూ ఉండాలి. ఓపెన్ అయిన వెంటనే చకచకా బుకింగ్ చేసేయాలి.  ముందుగానే డీటెయిల్స్ ఫిల్ చేశారు. కాబట్టి బుకింగ్స్ ఓపెన్ అయిన సెకన్లలోనే పేమెంట్ చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా బుకింగ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.

స్పెషల్ కోటా

మీరు సీనియర్ సిటిజెన్స్ లేదా మహిళల కోటాకు చెందిన వారైతే.. కింద ఆ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు అదనపు ప్రయోజనం పొందొచ్చు. మీకు కేటాయించిన కోటాలో టికెట్స్ లభిస్తాయి. కాబట్టి జనరల్ కోటాతో పోలిస్తే  కాంపిటీషన్ తగ్గుతుంది. టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం పెరుగుతుంది.

మల్టిపుల్ బుకింగ్స్

ఎలాగైనా మీకు టికెట్ కావాలి అనుకుంటే ఒకేసారి ఇద్దరు ట్రై చేయడం మంచిది. ఫోన్ ప్రాసెసర్ స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్ ను బట్టి కూడా బుకింగ్ ఛాన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి రెండు అకౌంట్స్ ద్వారా ట్రై చేస్తే.. కన్ఫర్మ్ అయ్యే అవకాశం కొంత పెరగొచ్చు.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు ట్రైన్ ను ఎంచుకునేటప్పుడు ఆ రూట్ లో వెళ్లే అన్ని ట్రైన్స్ గురించి తెలుసుకుని.. షార్టెస్ట్ సర్వీస్ ను ఎంచుకుంటే మంచిది. ఎక్కువ స్టేషన్లు , ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ కు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ రూట్ ప్రయాణించే ట్రైన్ ను ఎంచుకోవాలి. అలాగే జర్నీలను వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే బుకింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *