
చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రేమకథలతో యూత్ ఫేవరెట్ గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసి విధి ఓర్వలేకపోయిందేమో? అందుకేనేమో ఒకానొక దశలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో రేంజ్ నుంచి సినిమా అవకాశాల కోసం వెతుక్కునే స్థాయికి వచ్చాడు. అయితే ఈ బాధను అతను భరించలేపోయాడు. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని సినీ అభిమానులందరికీ తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. అయితే ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ కు అతని నిర్ణయాలు కూడా ఒక కారణమని తెలిసింది. సినిమా కథల ఎంపికలో పొరపాట్లే అతనిని మరింత కిందకు లాగాయని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా తన దాకా వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేశాడట. అందులో ప్రభాస్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉందట. 2004లో సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయిన ఈ మూవీ మొదట ఉదయ్ కిరణే చేయాల్సింది . అతనినే హీరోగా అనుకున్నారట. దాదాపు ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యింది.అయితే కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఈ మూవీ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో ఇదే సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించారు. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇలా ఉదయ్ కిరణ్ చేతుల్లోంచి జారిపోయిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? వర్షం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కి జోడీగా హీరోయిన్గా త్రిష నటించింది. గోపీచంద్ విలన్‌గా అదరగొట్టాడు. అయితే మొదట ఈ మూవీలో హీరోగా ఉదయ్ కిరణ్ కే ఛాన్స్ వచ్చిందట. అయితే వివిధ కారణాలతో ఉదయ్ ఈ మూవీపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. ఫలితంగా ఈ మూవీ ప్రభాస్ వద్దకు వెళ్లడం, అతను ఓకే చెప్పడం, సినిమా సెట్స్ పైకి వెళ్లడం.. తీరా రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. వర్షం సినిమా మొదటి రోజునే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. ఒకేళ ఉదయ్ కిరణ్ ఓ బ్లాక్ బస్టర్ మూవీని చేసి ఉంటే అతన లైఫ్ టర్న్ అయ్యోదేమో!.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.