40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్

40 ఏళ్లకి తల్లి కాబోతున్న హీరోయిన్


బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య.. కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ‘కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. మా జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు విక్కీ-కత్రినా. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కత్రినా-విక్కీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విక్కీ , కత్రినాలది ప్రేమ వివాహం. 2021 డిసెంబర్‌ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కత్రినా-విక్కీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు కానున్నారు. దీంతో ఈ జంట ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్

మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్

ట్రంప్‌ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్‌ కానుందా

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *