బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అలాగే ఈ సీజన్ లో అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లు గానే కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం ఎపిసోడ్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై కాగా దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. హౌస్ మేట్స్ అందరూ గాఢ నిద్రలో ఉండగా వారిని డేంజర్ సైరన్ మోగించి మరీ బిగ్ బాస్ నిద్రలేపాడు. ఈ వారం ప్రారంభంలో సభ్యుల పేర్లతో సీడ్స్ ఇచ్చిన బిగ్ బాస్.. అందులో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక పవర్ ఇచ్చారు. ఇంటి నుంచి ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపే అవకాశం కల్పించారు. దీంతో రెడ్ సీడ్ అందుకున్న భరణి, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము.. ఎవరిని బయటకు పంపించాలన్న దానిపై సీరియస్ గా డిస్కస్ చేశారు. తోటి సభ్యులను రెచ్చగొడుతున్న కారణంగా తాను సంజనాను ఇంటి నుంచి బయటకు పంపాలని భావిస్తున్నట్లు మాస్క్ మ్యాన్ హరీశ్ తేల్చి చెప్పాడు. అలాగే రాము, డిమాన్ పవన్ సైతం సంజనపై ఆరోపణలు చేస్తూ బయటకు పంపించాలని బిగ్ బాస్ కు తెలియజేస్తారు
మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేయడంతో బిగ్ బాస్ వెంటనే మెయిన్ గేట్ నుంచి ఆమెను బయటకు వెళ్లమన్నాడు. అయితే హరీశ్, రాము, డిమాన్ ల మాటలకు సంజనా బాగా ఎమోషనలైంది. తనను కార్నర్ చేసి బయటకు పంపుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హౌస్ మేట్స్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు తన లగేజీ బ్యాగ్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడాన్ని ప్రోమోలో చూపించారు. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది. ఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ సీక్రెట్రూమ్లో తీసుకొస్తారు.
పైగా ఈ వారం సంజనా అసలు నామినేషన్స్లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని బిగ్ బాస్ ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.