పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రికార్డుల వేట షురూ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఇప్పుడు వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 25) న రిలీజైన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్ ను షేర్ చేస్తూ ‘ఇది పవన్ కల్యాణ్ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. కాగా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలోనూ ‘ఓజీ’ స్థానం దక్కించుకుంది. అలాగే తెలుగు సినిమాల పరంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఓజీ ఏడో స్థానంలో నిలిచింది.
సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు.. ఇలా భారీ తారగణమే ఓజీలో ఉంది. ఇక తమన్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
ఇవి కూడా చదవండి
ఇది పవన్ కల్యాణ్ సినిమా..
Idhi Pawan Kalyan Cinema…..#OG Erases History 🔥
Worldwide Day 1 Gross – 154 Cr+ 💥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/Olf8owSSSZ
— DVV Entertainment (@DVVMovies) September 26, 2025
హైదరాబాద్ విమల్ థియేటర్ లో ఓజీ సినిమాను చూస్తోన్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్
Nenu ippudu Hyderabad raavadaniki oke kaaranam #PowerStar #OG choodataaniki maathrame…ee mass experience ni telugu vaallatho chooddame kadha mass pic.twitter.com/E3L4amiht6
— Pradeep Ranganathan (@pradeeponelife) September 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.